ఆ సంజీవ‌ని మాకివ్వండి.. మోదీని కోరిన బ్రెజిల్ అధ్య‌క్షుడు

హ‌నుమ‌జ‌యంతి రోజున బ్రెజిల్ అధ్య‌క్షుడు జెయిర్ బొల్స‌నారో .. ప్ర‌ధాని మోదీతో రామ‌య‌ణ స‌న్నివేశాన్ని గుర్తు చేశారు.  క‌రోనా రోగుల చికిత్స కోసం హైడ్రాక్సీక్లోరోక్వీన్ కావాలంటూ బొల్స‌నారో.. ప్ర‌ధాని మోదీని ఓ లేఖ‌లో కోరారు. దాంట్లో ఆయ‌న రామాయ‌ణ ప్ర‌స్తావ‌న తెచ్చారు.  ల‌క్ష్మ‌ణుడిని కాపాడేందుకు హిమాల‌యాల నుంచి హ‌నుమంతుడు సంజీవిని తీసుకువ‌చ్చార‌న్నార‌న్నారు. అలాగే పేద‌ల‌ను కాపాడేందుకు జీసెస్ కూడా ఎన్నో మ‌హిమ‌లు ప్ర‌ద‌ర్శించి రోగాల‌ను పార‌ద్రోలార‌ని,  ఆ రీతిలోనే మాకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్ర‌ల‌ను ఇచ్చి మ‌మ్ముల్ని కాపాడాలంటూ బ్రెజిల్ అధ్య‌క్షుడు బొల్స‌నారో ఇవాళ‌ మోదీకి లేఖ రాశారు. బ్రెజిల్‌కు పూర్తి స‌హ‌కారం చేస్తామ‌ని మోదీ భ‌రోసా ఇచ్చారు.