భారత ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ వేసిన బ్రహ్మర్షి విశ్వామిత్ర పెయింటింగ్ వేలంలో రికార్డు ధరకు అమ్ముడుపోయింది. అమెరికన్ మల్టినేషనల్ కార్పొరేషన్ సోథ్బైస్ నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో గుర్తుతెలియని వ్యక్తి 8.6 లక్షల డాలర్ల(రూ.6 కోట్ల 45 లక్షలు)కు దక్కించుకున్నాడు. చిత్రంలో విశ్వామిత్ర సుదీర్ఘ ధ్యానముద్రలో ఉన్నారు. సోథిబైస్ గత నెలలో ఆన్‌లైన్ బిడ్డింగ్‌ను 7 నుంచి 9 లక్షల డాలర్ల అంచనా వ్యయంతో ప్రారంభించింది. రెండు రోజుల క్రితమే బిడ్ ముగిసింది.
ఈ అరుదైన పెయింటింగ్‌ను గుర్తుతెలియని వ్యక్తి చేజిక్కించుకున్నాడు. రాజా రవివర్మ పెయింటింగ్స్‌లో సోథిబైస్ నిర్వహించిన బిడ్డింగ్‌లో అత్యంత ఎక్కువకు అమ్ముడైన రెండో పెయింటింగ్ ఇది. 2017లో వర్మ పెయింటింగ్ దమయంతి 16.92 లక్షల డాలర్లకు అమ్ముడుపోయింది.